గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 మే 2020 (13:35 IST)

వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ సేవ్ చేయాలంటే క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే చాలు

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్ వస్తోంది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌‌లో మరో ఫీచర్‌ జోడించబోతోంది. సాధారణంగా ఎవరి ఫోన్‌ నెంబరైనా మన ఫోన్‌లో ఫీడ్‌ చేసుకోవాలంటే కాంటాక్ట్‌ మెనుకూ వెళ్లి అక్కడ టైప్‌ చేసి, యాడ్‌ కాంటాక్ట్‌ కొట్టి, ఆ పై పేరు సేవ్‌ చేసుకుంటాం. 
 
ఒకట్రెండు నెంబర్లైతే సరేకానీ అదే పదుల సంఖ్యలో ఉంటే, ఇలాంటి సందర్భాల కోసమే వాట్సాప్‌ ఈ సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది.
 
ఎవరి కాంటాక్ట్‌ అయిన మన ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలంటే వాట్సాప్‌లోని వాళ్ల క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా ఆ కాంటాక్ట్‌ మన ఫోన్‌లో యాడ్‌ అయిపోతుంది. 
 
ప్రస్తుతం ఇది బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. వాట్సాప్‌ సెట్టింగ్స్‌ మెనులో ఈ ఆప్షన్‌ను తీసుకురానున్నారు. ఈ ఆప్షన్‌ వస్తే, మ్యానువల్‌గా సేవ్‌ చేసుకోవాల్సిన కాంటాక్ట్‌లను ఒక్క స్కాన్‌తో యాడ్‌ అయిపోతాయి.