శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (14:31 IST)

లాక్ డౌన్ తర్వాత రెండేళ్ల పాటు శాకాహారమే తినాలట.. వాట్సాప్‌లో వార్తలు

లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత పాటించాల్సిన నిబంధనలు అంటూ సోషల్‌ మీడియాలో నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వార్తే ఒకటి అనేక వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. లాక్‌డౌన్‌ తర్వాత పాటించాల్సిన నిబంధనల గురించి భారత వైద్య పరిశోధనా మండలి చేసిన సూచనలు అని పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెసేజ్‌ను ఫార్వార్డ్‌ చేశారు. 
 
లాక్‌డౌన్‌ తర్వాత ''రెండేళ్ల పాటు విదేశీ ప్రయాణాలు మానుకోవాలి, ఏడాది పాటు బయటి ఫుడ్‌ తినకూడదు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వెళ్లకపోవడమే మంచిది.. సమావేశాలకు ఏడాదిపాటు దూరంగా ఉండాలి. శాకాహారమే తీసుకోవాలి.. బెల్టు, రింగులు, వాచ్‌, ధరించకూడదు. ఫోన్‌లోనే టైం చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి.. వాచ్‌ అనవసరం. హ్యాండ్‌ కర్చీఫ్‌ అవసరం లేదు. 
 
శానిటైజర్‌, టిష్యూ తీసుకువెళ్తే చాలు.. అంటూ ఇలా దాదాపు 21 రూల్స్‌తో ఆ మెసేజ్‌ను నింపి.. నెటిజన్లను ఆందోళనలో పడేశారు. ఇదంతా నిజం కాదని.. అవాస్తవమని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రజనీకాంత్‌ కొట్టిపారేశారు.