సంబంధిత వార్తలు
- హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ‘ఛత్రపతి’ సెట్
- తిరుమల దర్శన టిక్కెట్లు ఆన్ లైన్లో అలానే వుంటున్నాయి, తీసుకున్న భక్తులు రావడంలేదు
- హిందీ `ఛత్రపతి` తర్వాత ధనుష్ ‘కర్ణన్’ రీమేక్‌తో సాయి శ్రీనివాస్
- 50మిలియన్స్‌కి పైగా చేరుకున్న లవ్లీ హిందీ వెర్షన్ `విజయ్ మేరీ హై`
- ఫ్లిప్‌కార్ట్ కొత్త సర్వీస్.. 90 నిమిషాల్లోనే ఇంటికి డెలీవరి..
కరోనా టీకాల కోసం.. ప్రాంతీయ భాషల్లోనూ రిజిస్ట్రేషన్
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. వాటి నియంత్రణకు టీకాలు వచ్చాయి. టీకాల కోసం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ అయిన కోవిన్‌లో ఇంగ్లీష్ భాషలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. కానీ ఇక నుండి కోవిన్ హిందీతోపాటు పది భాషల్లో టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
తెలుగు, మరాఠి, మళయాళం, పంజాబీ, గుజరాతి, అస్సామీ, బెంగాలీ, ఒడియా భాషల్లోనూ రిజిష్ట్రేషన్ చేయించుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వారు టీకా వేయించుకోవాలంటే రిజిష్ట్రేషన్ తప్పనిసరి. దీంతో రిజిష్ట్రేషన్ సమయంలో భాషతో సమస్యగా మారింది.
ఇందుకోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువకులు కోవిడ్ సిబ్బంది సహాయం తీసుకుంటున్నారు. దీంతో వారిపై పని భారం పెరిగిపోయింది. దీన్ని తగ్గించాలనే ఉద్ధేశ్యంతోనే ప్రాంతీయ భాషల్లోనూ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
