శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 జూన్ 2021 (08:24 IST)

పెరిగిన బంగారం ధర..

ఏ చిన్న శుభ కార్య‌మైనా స‌రే ఒక తులం బంగారం కొనేద్దామ‌ని చాలా మంది బావిస్తుంటారు. అంత‌లా బంగారం మ‌న‌లో భాగ‌మైపోయింది. అందుకే బంగారం ధ‌ర‌ల గురించి తెలుసుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటాం. ఈ క్ర‌మంలోనే తాజాగా భార‌త‌దేశంలో బంగారం ధ‌ర‌లో హెచ్చుత‌గ్గులు క‌నిపిస్తున్నాయి.

ఇలా శ‌నివారం భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లో ఆదివారం మ‌ళ్లీ మార్పు క‌నిపించింది. ఆదివారం తులం బంగారం సుమారు రూ. 400కి పైగా పెరిగింది. 
 
22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,900 (శ‌నివారం రూ. 45,500 )గా వుండగా, 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,070 (శ‌నివారం రూ. 49,640 )గా వుంది. విశాఖ‌ప‌ట్నంలో 22 క్యారెట్‌ల గోల్డ్ రేట్ – రూ. 45,900 (శ‌నివారం రూ. 45,500 ), 24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,070 (శ‌నివారం రూ. 49,640)గా వుంది.