1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Gold Price increase despite Covid Crisis

రూ.50 వేలకు చేరువలో బంగారం ధరలు

Gold Price
బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. భారత్‌లో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం ధర... ఇవాళ మాత్రం భారీగా పెరిగింది. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కిందికి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ.48,660కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.44,600కు చేరింది. 
 
ఇక ఈ రోజు బంగారం ధరలు పెరగగా... వెండి ధరలు మాత్రం నిలకడగా ఉంది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.76,100 వద్ద కొనసాగుతోంది. అయితే, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోళ్ళు బాగా తగ్గిపోతున్నాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
అత్యవసర ప్రయాణికులకు ఇ-పాస్‌ : ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌