శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (11:09 IST)

షాకిస్తున్న పసిడి ధరలు.. రోజు రోజుకూ పెరుగుతున్న ధర

దేశంలో పసిడి ధరలు షాకిస్తున్నాయి. వీటి ధరలు దేశ వ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఫలితంగా పసిడి ధర రోజు రోజుకూ దూసుకుపోతోంది. కరోనా మహమ్మారి కాలంలో తగ్గుముఖం పడుతుందని అనుకున్నా.. ఏమాత్రం ఆగకుండా పరుగులు పెడుతోంది. మంగళవారం కంటే బుధవారం మరింతగా పెరిగింది. బుధవారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.230 మేర పెరిగింది. 
 
ఇకపోతే, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలను పరిశీలిస్తే, రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,980 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.50,980 ఉంది. 
 
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,390 ఉండగా, 24 క్యారెట్ల రూ.50,600 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, రూ.47,900 వద్ద ఉంది. 
 
అలాగే కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,970 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది.