1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Today Corona Bulletin : Covid Positive Cases

జూన్ 1st కరోనా బులెటిన్ : క్రమంగా తగ్గుతున్న పాజిటివ్ కేసులు

Today Corona Bulletin
దేశంలో కరోనా కొత్త పాజిటివ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో అంటే సోమవారం 1,27,510 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వాటి ప్రకారం... నిన్న 2,55,287 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,81,75,044కు చేరింది. 
 
మరోవైపు, 2,795 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,31,895కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,59,47,629 మంది కోలుకున్నారు. 18,95,520 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 21,60,46,638 మందికి వ్యాక్సిన్లు వేశారు.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 34,67,92,257 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,25,374 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భారత విమానాలపై నిషేధం పొడగించిన ఫిలిప్పీన్స్