సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-06-2021 బుధవారం రాశి ఫలితాలు - మహావిష్ణువును పూజించినా...

మేషం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. అపుడపుడూ పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు. అధికారులతో మనస్పర్థలు తలెత్తుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. 
 
వృషభం : అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. షాపుల మార్పుతో వ్యాపారాలు ఊపందుకుంటాయ. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రదేశ సందర్శనలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. కోర్టు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మిథునం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజు, చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. బృంద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. మీలోని బలహీనతలను తొలగించుకోవడంపై దృష్టిపెడతారు. 
 
కర్కాటకం : ఆర్థిక పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ప్రముఖులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి. తలపెట్టిన పనుల్లో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
సింహం : ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటుంది. మీ మాటకు సర్వత్రా మంచి స్పందన లభిస్తుంది. ధనవ్యయం, శ్రమాధిక్యతతో వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఉత్తర ప్రత్యుత్తారుల సంతృప్తికరంగా సాగుతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానివేళలో బంధుమిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
కన్య : భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ప్రభుత్వ కార్యక్రమాలలో పనులు సానుకూలమవుతాయి. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. 
 
తుల : చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు ఎంతో అసవరం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవచ్చును. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
వృశ్చికం : మిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీల తొందరపాటుతనం వల్ల బంధు వర్గాల నుంచి మాటపడవలసి వస్తుంది. 
 
ధనస్సు : విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తినిస్తాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మిమ్మలను తప్పుదారి పట్టించి లబ్ది పొందాలని యత్నిస్తారు. మొండిబాకీలు వసూలు కొంతమేరకు వసూలు కాగలవు. 
 
మకరం : అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు అందుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. స్త్రీలకు టీవీ ఛానెళ్ళ కార్యక్రమాల పట్ల ఆసక్తి తగిన అవకాశాలు కలిసివస్తాయి. 
 
కుంభం : వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏది జరిగినా మంచికేనని భావించండి. కొన్ని పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. మిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. 
 
మీనం : ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదే ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.