సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

శుక్రవారం (28-05-2021) రాశిఫలితాలు - లక్ష్మీదేవిని పూజించి, అర్చించినా శుభం

మేషం : విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి. ధన సహాయం, హామీలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యాలు మానసిక ప్రశాంతతనిస్తాయి. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఒక ముఖ్యమైన విషయమై న్యాయసలహా పొందుతారు. 
 
వృషభం : ఆర్థిక విషయాల్లో సంతృప్తికానరాదు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ చిరువ్యాపారులకు కలిసిరాగలదు. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దైవ, కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. నూతన పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ అవసరం. 
 
మిథునం : చిట్‌ఫండ్, ఫైనాన్స్ రంగాలలో వారికి ఖాతా దారుల నుంచి ఒత్తిడిపెరుగుతుంది. దృఢ సంకల్పంతో ముందుకుసాగండి. కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఖర్చులు పెరగడంతో స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. స్త్రీలకు బంధు వర్గాలతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
కర్కాటకం : ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. స్త్రీల తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖాదీ, చేనేత, నూలు వస్త్రాల కొనుగోళ్ళు అధికంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం గోచరిస్తుంది. సిమెంట్, ఐరన్, కలప, వ్యాపారస్తులకు లాభదాయకం. 
 
సింహం : రాజకీయ రంగాల్లో వారికి అప్రమత్తత అవసరం. అధిక ఉష్టం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. నూతన ప్రదేశ్ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. హోటల్, కేటరింగ్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకం. దైవ, సేవా పుణ్యకార్యాలలో నిమగ్నమవుతారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
కన్య : కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో లౌక్యం అవసరం. బృంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత లోపిస్తుంది. ప్రత్యర్థులు మీ ఉన్నతిని, సమర్థతను గుర్తిస్తారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. కుటుంబీకులతో కలిసి దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
తుల : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఓర్పు, నేర్పుతో వ్యవహరిచండి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
వృశ్చికం : వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. రుణాలు తీర్చడానికై చేయుయత్నాలు ఒక కొలిక్కిరాగలవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ మాటతీరు, పద్దతులను మార్చుకోవలసి ఉంటుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. 
 
ధనస్సు : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ధనవ్యయం అధికంగా ఉన్నా సార్థకత ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రావలసిన పత్రాలు, రశీదులు చేతికందుతాయి. వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. 
 
మకరం : సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు కలిసిరాగలదు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకుల వల్ల ఆందోళన చెందుతారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. కొంత ఆలస్యంగానైనా పనులు పూర్తికాగలవు. 
 
కుంభం : వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. విదేశీయాన యత్నాలు ఒక కొలిక్కిరాగలవు. విద్యార్థులతో నూతన ఉత్సాహం కానవస్తుంది. నిర్మాణపనులలో గృహ మరమ్మతులలో ఏకాగ్రత వహించండి. మీ అతిథి మర్యాదలలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఎలక్ట్రానిక్, ఏసీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. 
 
మీనం : ఉమ్మడి ఆర్థిక లావాదేవీల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. మీ స్తోమతకు మించి వాగ్దానాలు చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుణాలు తీర్చడానికై చేయుయత్నాలు ఒక కొలిక్కి రాగలవు.