శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-05-2021 శనివారం రాశిఫలితాలు - శ్రీమన్నారాయణ స్వామిని తులసీదళాలతో...

మేషం : ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలు, నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. 
 
వృషభం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చేకాలం. సంతానం విషయంలో సంజాయిషీల ఇచ్చుకోవలసి వస్తుంది. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, పనియందు ఏకాగ్రత ఎంతో ముఖ్యం. మీరు చేసిన సాయానికి సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. క్రీడల పట్ల నూతనోత్సాహం కానవస్తుంది. 
 
మిథునం : ఆర్థిక వ్యవహారాలు, ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. విదేశీయ యత్నాల్లో ఎదురైనా ఆటంకాలు అధికమిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 
 
కర్కాటకం : వ్యాపార వర్గాల వారు చెక్కుల జారీ, ఖాతాదారుల, పనివారలతో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మధ్యవర్తుల ద్వారా మీ ప్రేమ సఫలమవుతుంది. 
 
సింహం : బంధువులతో మాటపట్టింపులు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మాటపడతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెంపుడు జంతువుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. మిత్రుల కారణంగా కొన్ని పనులు వాయిదాపడతాయి. 
 
కన్య : రాజకీయాల్లో వారు మార్పులను కోరుకుంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. ప్రియతముల రాక ఉల్లాసం కలిగిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు బాగుగా కలిసివస్తాయి. పాత మొండిబాకీలు వసూలు కాగలవు. కళలు, ఫోటోగ్రఫీ, ఉన్నత విద్య, రంగాల వారికి అనుకూలమైన సమయం. 
 
తుల : విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. ఆపత్సమయంలో మిత్రులకు అండగా నిలుస్తారు. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. 
 
వృశ్చికం : స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. వాగ్వివాదాలకు దిగి సమస్యలు కొని తెచ్చుకోకండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రేషన్ డీలర్లకు అధికారులు నుంచి వేధింపులు అధికంగా ఉంటాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
ధనస్సు : వస్త్ర పరిశ్రమల వారికి లాభదాయకంగా ఉంటుంది. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంకల్ప బలానికి సన్నిహితుల సహాయం తోడవుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. 
 
మకరం : ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. పోస్టల్ కొరియర్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. కళా, క్రీడా రంగాల్లో వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కుంభం : బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. 
 
మీనం : వ్యాపారాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారు. ఉద్యోగస్తులకు అందితన ఒక సమాచారం. ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. రచయితలకు పత్రికా రంగాల వారికి చికాకులు తప్పవు. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల వ్యవహారాల్లో పునరాలోచన అవసరం.