మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (15:40 IST)

ఫ్లిప్‌కార్ట్ కొత్త సర్వీస్.. 90 నిమిషాల్లోనే ఇంటికి డెలీవరి..

ఆన్‌లైన్‌లో అగ్రగామి అయిన ఫ్లిప్‌కార్ట్ ఆర్డర్ చేసిన గంటన్నరలో డెలివరీ చేస్తామంటూ కొత్త సర్వీస్‌ని ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ క్విక్ పేరుతో ఈ సర్వీస్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న హైపర్ లోకల్, సూపర్ ఫాస్ట్ సర్వీస్ ఇది. ఈ సర్వీస్ పరిధిలోకి వచ్చే ప్రొడక్ట్స్‌ని ఆర్డర్ చేస్తే కేవలం 90 నిమిషాల్లో ఇంటికి వస్తాయి. గతంలోనే దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ సర్వీస్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఫ్లిప్‌కార్ట్. 
 
హైదరాబాద్‌లో కూడా ఫ్లిప్‌కార్ట్ క్విక్ ట్రయల్ సక్సెస్ అయింది. దీంతో ఈ సర్వీస్‌ను అధికారికంగా ప్రారంభించింది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, పూణెలో ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్ అధికారికంగా ప్రారంభమైంది.
 
ఫ్లిప్‌కార్ట్‌ క్విక్ ద్వారా నిత్యావసర వస్తువుల్ని ఆర్డర్ చేసి వెంటనే తెప్పించుకోవచ్చు. కోవిడ్ 19 ని ఎదుర్కోవడానికి కావాల్సిన వస్తువులు, నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు, బేబీ కేర్ ప్రొడక్ట్స్, మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్‌ని ఫ్లిప్‌కార్ట్ క్విక్ సర్వీస్ ద్వారా ఆర్డర్ చేసిన గంటన్నరలో పొందొచ్చు.
 
మొదటి ఆర్డర్‌పై డెలివరీ ఉచితం. ఆ తర్వాత రూ.499 కన్నా ఎక్కువ ఆర్డర్లపై ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడైనా ఆర్డర్స్ చేయొచ్చు. కస్టమర్లకు వీలైనంత త్వరగా ప్రొడక్ట్స్‌ని డెలివరీ చేసేందుకు షాడోఫ్యాక్స్ లాంటి లాజిస్టిక్స్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది ఫ్లిప్‌కార్ట్.