బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (20:44 IST)

మధురై: శరవణన్ వర్సెస్ షేక్ దావూద్.. రూ.10లక్షల రుణమాఫీ.. రోజూ మందు సప్లై!

తమిళనాడులోని దక్షిణ మధురై నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న శరవరణ్ అనే వ్యక్తి.. తన నియోజకవర్గం కోసం స్పెషల్ మేనిఫెస్టోను తయారు చేశారు. అది చదువుకున్నవారికి నవ్వాలో ఎడవాలో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఇతకి సదరు అభ్యర్థి ఏయే హామీలిచ్చాడంటే.. నియోజకవర్గ ప్రజలందరిని బ్యాచ్‌ల వారీగా చంద్రమండలానికి తరలించడం.. ఇందుకోసం స్థానికంగా రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయడం.
 
ఇక ఇళ్లలో ఆడవాళ్లకు పనిలో సాయంగా ఉండేందుకు ఇంటింటికీ ఓ రోబోను పంపిణీ చేస్తాడట. అలాగే మధురైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కాలువలు తవ్వించడమే కాకుండా.. ఇంటికో బోటు ఇస్తారట. ఇక ఎండవేడి నుంచి నియోజకవర్గాన్ని కాపాడుకునేందుకు 300 అడుగుల ఎత్తులో కృత్రిమ మంచుకొండను నిర్మిస్తాడట.
 
ప్రస్తుతం తమిళనాడులోని అంథియుర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న షేక్ దావూద్ అనే అభ్యర్థి స్థానిక ఓటర్లకు విస్తుపోయే హామీలిచ్చాడు. సౌత్ మధురైలో పోటీ చేస్తున్న శరవణన్‌కు ధీటుగా హామీల వర్షం కురిపించాడు. తనను గెలిపిస్తే ప్రతి ఇంటికీ పదిలక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ప్రకటించాడు. 
 
అంతేకాదు ఒక్కో ఇంటికి పాతికవేలు ఇస్తామన్నాడు. మందుబాబులను కుర్రాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతి రోజూ ఇంటికి లీటర్ మందు.. లేదా బీర్.. ఎవరు ఏది కోరుకుంటే అది సరఫరా చేస్తానంటూ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. అంతేకాదు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణ జరిపిస్తానని చెప్పాడు.
 
అందరికంటే భిన్నంగా ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి తన నియోజకవర్గ ప్రజలకు సంచలన హామీలిచ్చారు. ఇంతవరకు దేశంలో ఏ అభ్యర్థి ఇవ్వని విధంగా హామీల వర్షం కురిపించారు. ఆ హామీలు విన్న ఓటర్లు షాక్ అవుతున్నారు. ఇక ప్రత్యర్థుల సంగతి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆ అభ్యర్థి ఇచ్చిన హామీలు తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి.