1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Fact Check: Holding breath for 10 seconds is not a coronavirus test

20-30 సెకన్ల పాటు శ్వాస బిగబట్టితే కరోనా లేనట్టేనా?

Fact Check
కరోనా వైరస్ మహమ్మారి కాలంలో సోషల్ మీడియాలో వివిధ రకాలైన సమాచారం షేర్ అవుతూ వస్తోంది. ముఖ్యంగా, క‌రోనా వైర‌స్ వ్యాప్తి, నిర్ధ‌ారణ‌, నివార‌ణ వంటి వాటిపై ఎన్నో ప్ర‌చారాలు ఉన్నాయి. ఇలాంటివాటిలో జ‌నాల్లో ఎక్కువగా ఉపోహ కలిగిన వార్త ఒకటి ఉంది. 10 లేదా 20 లేదా 30 సెకన్ల పాటు శ్వాస‌ను బిగ‌బ‌ట్ట‌డం ద్వారా క‌రోనా వైర‌స్ సోకిందో లేదో తెలుసుకోవచ్చనే  వార్త సోషల్ మీడియాలో వైరస్ అవుతోంది. మరి ఆ వార్తలో నిజమెంతో వైద్యులను అడిగి తెలుసుకుందాం. 
 
ఇందులో ఏ మాత్రం నిజం లేదు. దీనిని ఎవరూ ధ్రువీకరించలేదని పీఐబీ ప్యాక్ట్‌ చెక్‌లో తేలింది. శ్వాస పీల్చుకోకుండా పది సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం బిగబట్టి ఉన్నంత మాత్రాన మనలో కరోనా వైరస్‌ లేనట్లేనని చెప్పలేమని తేల్చింది. 
 
ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా లక్షణాలు ఉన్నవారు ఆర్టీపీసీఆర్‌ లేదా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష చేయించుకోవాలి. కరోనాను ధ్రువీకరించడానికి డబ్ల్యూహెచ్‌వో, భారత ప్రభుత్వం ఈ టెస్టులను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నాయని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చెబుతోంది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
వదినను గదిలోకి లాక్కెళుతున్న మరిది, సడెన్‌గా అన్న రావడంతో..?