గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 10 నవంబరు 2020 (10:28 IST)

నాగ్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు, టెన్షన్‌లో బిగ్ బాస్ హౌస్, బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకని కరోనా టెస్ట్ చేయించుకుంటే.. ఆయనకు పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ప్రకటించారు. అంతేకాకుండా.. ఇటీవల తనని కలిసిన వాళ్లు టెస్ట్ చేయించుకోవాలి అని కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియచేసారు.
 
ఇటీవల చిరంజీవి సీఎం కెసీఆర్‌ని కలిసారు. అలాగే నాగార్జునతో కలిసి వెళ్లి కేసీఆర్‌ని కలిసారు. అందుచేత ఇప్పుడు కేసీఆర్, నాగార్జున కరోనా టెస్ట్ చేయించుకోవాలి. నాగార్జున కరోనా టెస్ట్ చేయించుకున్నారు. రిజెల్ట్ రావాల్సి వుంది. ఇలా.. నాగార్జున కరోనా టెస్ట్ చేయించుకున్నారు అని తెలియగానే... బిగ్ బాస్ హౌస్ టెన్షన్ పడుతుందని సమాచారం.
 
అవును.. నాగార్జునకు ఏ రిజెల్ట్ వస్తుందో అని తెగ టెన్షన్ పడుతున్నారట. ఎందుకంటే... పాజిటివ్ వస్తే... బిగ్ బాస్ హోస్ట్‌గా వేరే వాళ్లను చూసుకోవాలి. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకని స్టార్ మా టీవీ యాజమాన్యం టెన్షన్ పడుతుందని టాలీవుడ్లో టాక్. ఇది ఓకే మరి.. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ టెన్షన్ పడడం ఏంటి అనుకుంటున్నారా..?
 
మేటర్ ఏంటంటే... నాగార్జున బాలీవుడ్ మూవీ బ్రహ్మస్త్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌లో నాగార్జున పాల్గొనాల్సి వుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు అనుకున్నారు. ఇంతలో నాగ్ కరోనా టెస్ట్ చేయించుకోవాల్సి రావడంతో టెన్షన్ పడుతున్నారు. మరి.. ఏం జరగనుందో చూడాలి.