బిగ్ బాస్ హౌజ్‌లో నామినేషన్ ప్రక్రియ.. నువ్వు నన్ను మోసం చేశావ్..!

bigg boss 3
bigg boss 3
సెల్వి| Last Updated: మంగళవారం, 3 నవంబరు 2020 (09:32 IST)
సోమవారం కావడంతో బిగ్ బాస్ హౌజ్‌లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఎవరి పేరు బిగ్ బాస్ చెబితే వారెళ్ళి నామినేషన్ చేయాలనుకునే వారి తలపై రెండు ఎగ్స్ పగలగొట్టాల్సి ఉంటుంది. అయితే ఎగ్ అంటే పడని మోనాల్ తను కొట్టించుకోలేనని చెప్పడంతో ఆల్టర్‌నేట్ సలహా ఇచ్చాడు. మీకు బదులుగా మీరు నామినేట్ చేసేవాళ్ల తలపై వేరేవాళ్ళు కోడిగుడ్డు పగల గొట్టాలని కోరవచ్చని చెప్పారు. ముందుగా కెప్టెన్ అరియాని పేరుని పిలిచారు బిగ్ బాస్.

హారిక తలపై కోడిగుడ్డు కొట్టిన అరియానా ఆమెని నామినేట్ చేసింది. రాక్షసుల టాస్క్‌లో ప్రవర్తన సరిగా లేని కారణంగా నామినేట్ చేసానని చెప్పుకొచ్చింది. ఇక రెండో గుడ్డుని సోహైల్‌పై పగలగొట్టగా, అతనిని నామినేట్ చేయడానికి కారణం పనిష్మెంట్ విషయంలో రచ్చ చేయడం అని అంది. ఈ విషయంలో నీదే తప్పు. నేను సాయంత్రం చేస్తా అన్నాను. నువ్వే చాలా ఓవరాక్షన్ చేశావు అంటూ సోహైల్ ఆమెపై ఎగిరాడు ఆటిట్యూడ్ చూపించకు, అదీ, ఇదీ అంటూ అరియానాపై నోరుజారుతూనే ఉన్నాడు. తను మాత్రం సైలెంట్‌గా ఉండి తన పని తాను చేసుకుంటూ వెళ్లింది.

నువ్వు పనిష్మెంట్ విషయంతో నామినేట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు అని సోహైల్ అనడంతో అరియానా మరో విషయాన్ని చెప్పుకొచ్చింది. ఈ వారం కెప్టెన్ టాస్క్‌లో నువ్వు నన్ను మోసం చేసినట్టు అనిపించింది అనడంతో సోహైల్ అవును మోసం చేశాను. కావాలనే మోసం చేశాను అన్నాడు. అసలు థర్డ్ రౌండ్ కూడా ఎందుకు ఆడానో అంటూ చిరాకు వస్తుందని తన అసహనాన్ని అరియానా దగ్గర వెళ్ళగక్కాడు.

సోమవారం 58వ ఎపిసోడ్ అఖిల్, మోనాల్ ముచ్చటతో ప్రారంభమైంది. నా పక్కన కూర్చోవడం లేదు, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు అని మోనాల్ అనడంతో అలాంటిదేమి లేదని అన్నాడు అఖిల్. అయితే ఓ హగ్ ఇవ్వు అని మోనాల్ అనడంతో అఖిల్ ఆమెను కౌగిలించుకున్నాడు. ఇది నా అఖిల్ హగ్ కాదంటూ మోనాల్ అనడంతో నాకు కొంత టైం ఇవ్వు అని అన్నాడు.

ఇక సోహైల్‌, మెహబూబ్ ప్రపంచాన్ని మరచిపోయి నిద్రపోతుంటే బిగ్ బాస్ హౌజ్‌లో కుక్కలు మొరిగాయి. మెహబూబ్ తను నిద్రపోతున్న విషయాన్ని ఒప్పుకోగా, సోహైల్ కవర్ చేసుకున్నాడు. అయితే కెప్టెన్‌గా ఉన్న అరియానా.. మెహబూబ్‌ని రెండు బకెట్ల నీళ్ళు పోసుకోవాలని పనిష్మెంట్ ఇచ్చింది. ఇందులో భాగంగా మెహబూబ్‌పై సోహైల్ రెండు బకెట్ల నీళ్ళు గుమ్మరించాడు. మరి కొద్ది సేపటి తర్వాత సోహైల్ మళ్ళీ నిద్రించాడు. దీంతో మళ్ళీ కుక్కలు మొరిగాయి. పనిష్మెంట్‌లో భాగంగా సోహైల్ తనపై నీళ్ళు పోసుకోవాలని అరియానా అనడంతో విభేదించాడు సోహైల్.

ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. సాయంత్రం పోసుకుంటాను అని సోహైల్ అనడంతో అరియానా తిరస్కరించింది. దీతంతో కోపంతో ఉరుక్కుంటూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్‌లో దూకాడు. నేను ఇక్కడే ఉంటా, తడి బట్టలతోనే ఉంటా. నా ఇష్టం అంటూ పిచ్చోడిలా ప్రవర్తించాడు. అఖిల్, అమ్మ రాజశేఖర్ ఎంత చెప్పిన కూడా సోహైల్ వినలేదు. దీంతో విసిగిపోయిన అఖిల్ మీరు పక్కకి వచ్చేయండి అంటూ అవినాష్‌తో అన్నాడు. ఇక సొహైల్ షూ లేస్ తీసుకున్న అరియానా దాన్ని తిరిగిఇవ్వకపోవడంతో నీకు పనిష్మెంట్ ఇస్తా అన్నాడు. అదేంటని అరగంట తర్వాత చెప్తా అంటూ తన బెడ్ దగ్గరకు వెళ్ళాడు.దీనిపై మరింత చదవండి :