సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (14:20 IST)

బిగ్ బాస్ హౌస్‌లో గజిబిజి జంట.. అబద్ధాల కోరుల జంట

బిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌కు శుక్రవారం సరికొత్త టాస్క్ ఇచ్చారు. అనారోగ్యంతో నోయల్ ఇంటి నుండి బయటకు వెళ్ళడంతో ప్రస్తుతం హౌజ్‌లో పదిమంది సభ్యులు ఉన్నారు. వీరిని ఐదుగ్రూపులుగా విభజించారు. అభిజిత్-హారిక, అఖిల్‌-మోనాల్‌, మెహబూబ్‌-సోహైల్‌, అమ్మ రాజశేఖర్‌-లాస్య, అరియానా- అవినాష్‌ జంటలుగా విడిపోయారు. 
 
ఈ జంటలకు సంబంధించిన బోర్డ్‌లను వారికి జత చేయాలని బిగ్ బాస్ చెప్పడంతో రాజశేఖర్-హారికలని గజిబిజి జంట అని హారిక- అభిజిత్ చెప్పగా, మెహబూబ్‌-సోహైల్.. "బద్ధకస్తుల జంట"గా అవినాష్- అరియానాలు చెప్పారు. అఖిల్, మోనాల్ "అబద్ధాల కోరుల జంట"గా సోహైల్‌- మెహబూబ్ పేర్లు చెప్పారు.
 
ఇక అఖిల్‌-మోనాల్ జంటకు అహంకారుల జోడి అని అవినాష్- అరియానాలు చెప్పగా, అభిజిత్‌- హారికల జంటని జీరో టాలెంట్ జంట అని మాస్టర్ లాస్య చెప్పుకొచ్చారు. అనంతరం ఆ మెడల్స్‌ని మెడలో వేసుకున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన మెడల్స్ నిజం కాదని నిరూపించుకోవాలి అంటే జంట పేరు పిలిచినప్పడల్లా వారు వివిధ టాస్క్‌లు చేయాలని అన్నారు.
 
జీరో టాలెంట్ అని పిలిచినప్పుడు హారిక- అభిజిత్ పర్‌ఫార్మెన్స్ చేయాలి. గజిబిజి జంట అని పిలిచినప్పుడు మాస్టర్, లాస్య స్విమ్మింగ్ పూల్‌లో దూకాల్సి ఉంటుంది. అబద్ధాల కోరుల జంటను పిలిచినప్పుడల్లా నోయల్‌, మెహబూబ్‌లు ఇంటిసభ్యుల గురించి నిజాలను కుండబద్ధలు కొట్టినట్లు చెప్పాల్సి ఉంటుంది.
 
అహంకారుల జంట అయిన మోనాల్‌-అఖిల్‌లు ఇంటి సభ్యులు ఏం చేసిన ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది. ఇక బద్ధకస్తుల జంట అయిన అవినాష్- అరియానాలు ఇంటి సభ్యులు ఏం పని ఇచ్చిన చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ అన్నారు. అయితే ఏ విషయంలో అబద్దం ఆడానని సోహైల్‌..అఖిల్ దగ్గర క్లారిటీ తీసుకున్నాడు. నాకు అనిపించింది చెప్పాను, నా గేమ్ నేను ఆడుతున్నా అని అఖిల్ అనడంతో ఇప్పటి నుండి నేను కూడా నా గేమ్ ఆడతా అని సోహైల్ సవాల్ విసిరాడు. అయితే ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరిన క్రమంలో అఖిల్ కన్నీరు పెట్టుకున్నాడు. సోహైల్ దగ్గరకు తీసుకొని ఓదార్చాడు.
 
ఇక టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యుల రెచ్చిపోయారు. మెహబూబ్‌.. అమ్మ రాజశేఖర్ మనస్తత్వాన్ని మార్చుకోవాలని హితవు పలకగా, అరియానా, అవినాష్‌లతో గిన్నెలు తోమించారు. మోనాల్ మీద నీళ్లు గుమ్మరించి, అఖిల్ ప్యాంటులో ఐస్ గడ్డలు వేసి ఇద్దరినీ స్విమ్మింగ్ పూల్‌లోకి తోశారు. గుడ్లు పగలగొట్టి వారి మీద వేశారు. ఇలా చేసిన కూడా వారు నవ్వుతూనే ఉన్నారు. 
 
అయితే టాస్క్ అయిపోయిందనుకొని అఖిల్ తన మంచం సర్ధాలని సోహైల్, మెహబూబ్‌లకు చెప్పాడు. నీకు కోపం వస్తుంది అంటే సర్ధుతాం అని మెహబూబ్ అన్నాడు. అయితే సోహైల్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళి బెడ్ సర్దేసరికి అఖిల్‌.. సోహైల్‌ని గట్టిగా హగ్ చేసుకున్నాడు. దీంతో సోహైల్ కన్నీరు పెట్టుకున్నాడు.