సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (16:06 IST)

బిగ్ బాస్ నాలుగో సీజన్.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఎవరో...?

బిగ్ బాస్ నాలుగో సీజన్ ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. 8వ వారం ఎలిమినేషన్‌లో అమ్మా రాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనాల్‌ ఉన్నారు. 8వ వారం ఓటింగ్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నారు అరియానా. ఇక లిస్ట్‌లో అమ్మా రాజశేఖర్ ఉండటంతో ఈ వారం హౌస్‌ నుండి ఎలిమినేట్ అయ్యేవారిలో ఆయన పేరు దాదాపుగా ఖరారైనట్లే. 
 
ఎందుకంటే ఇప్పటివరకు ఒక్క కుమార్ సాయి తప్ప మిగితావారంతా ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్నవారే. ఓటింగ్ శాతం పరంగా చూస్తే అరియానా 29.64,లాస్య 24.14,అఖిల్ 21.02,మోనాల్ 10.09,మెహబూబ్ 8.21,అమ్మా రాజశేఖర్ 6.91 శాతం ఓట్లతో ఉన్నారు. 
 
ఇప్పటివరకు 95091 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. తొలి వారంలో సూర్య కిరణ్,రెండవ వారంలో కరాటే కల్యాణి,మూడవ వారంలో స్వాతి దీక్షిత్,నాలుగో వారంలో దేవి నాగవల్లి,5వ వారంలో అనారోగ్యంతో గంగవ్వ, సుజాత ,6వ వారంలో కుమార్ సాయి,7వ వారంలో దివి ఎలిమినేట్ అయ్యారు.