మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (17:34 IST)

ఏనుగు ఆకారంలో బర్రెదూడ జననం...

శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఉన్నట్టుగా కొన్ని సంఘటనలు అపుడపుడూ జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ఆయన ఆనాడే తన కాలజ్ఞానంలో చెప్పారు. దీనివల్ల కోటి మంది చనిపోతారని చెప్పారు. ఆ విధంగానే ఇపుడు జరుగుతోంది. తాజాగా ఏనుగు ఆకారంలో బర్రె దూడ జన్మించింది. 
 
ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం, కుచులాపూర్ గ్రామంలోని ఓ రైతు ఇంట ఈ దూడ జన్మించింది. దూడ ముఖంపై తొండం ఉండటంతో రైతు కుటుంబం ఆశ్చర్యపోయింది. విషయం గ్రామంలో తెలియడంతో ఈ వింత దూడను చూసేందుకు స్థానికులతో పాటు.. చుట్టుపక్కల గ్రామాల వారు భారీగా తరలివస్తున్నారు.