శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (16:53 IST)

కరోనా టైమ్.. వైద్యుల నిర్లక్ష్యం.. శిశువుకు సరైన వైద్యం అందక మృతి

కరోనా సమయంలో వైద్యులు దేవుళ్లుగా మారిపోయారు. ఓ వైపు వైద్యులు కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తూ ప్రాణాలను నిలపెడుతుంటే కొంతమంది వైద్యులు మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలను తీసేస్తున్నారు. ఇలాంటి విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఏకంగా వైద్యుల నిర్లక్ష్యంతో ముక్కుపచ్చలారని శిశువు మృతి చెందింది.
 
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా కంది ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజుల శిశువు మృతి చెందింది. వికారాబాద్ మండలం అంతగిరి పల్లికి చెందిన ప్రవీణ్ గౌడ్ చాముండేశ్వరి దంపతులు. 
 
ఇక గర్భవతి అయిన చాముండేశ్వరి ఇటీవలే కందిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆ తర్వాత వైద్యుల నిర్లక్ష్యంతో శిశువుకు వైద్యం అందించకపోవడంతో మూడు రోజుల్లోనే మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.