శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (08:25 IST)

బ్రెజిల్‌లో స్నేహితురాలి దుశ్చర్య.. కడుపు కోసి శిశువు కిడ్నాప్

ఇటీవలికాలంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నబిడ్డలపై కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. అలాగే, జీవిత చరమాంకంలో రక్షించాల్సిన బిడ్డులు.. ఆస్తిపాస్తుల కోసం తల్లిదండ్రులను చంపేస్తారు. ఇక ప్రాణ స్నేహితులుగా ఉండే వారు వెన్నుపోటు పొడుస్తూ హేయమైన దారుణ చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ బ్రెజిల్‌లో ఓ దారుణం జరిగింది. ప్రాణస్నేహితురాలే ఈ దుశ్చర్యకు పాల్పడింది. నిండు గర్భంతో ఉన్న తన ఫ్రెండ్‌ను హత్య.... ఆమె కడుపు కోసి శిశువు అపహరించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సాంటా కాటెరినా రాష్ట్రం కానెలిన్హా నగరంలో ఫ్లావియా గోడిన్హో మాఫ్రా(24) అనే యువతి నిండు గర్భిణి. ఈమె స్కూల్‌ స్నేహితురాలికి కొన్ని నెలల క్రితం గర్భస్రావం జరిగింది. దీంతో మరో బిడ్డకోసం ప్రయత్నించకుండా, ఓ బిడ్డను దొంగిలించాలని ప్లాన్ వేసింది. 
 
అంతే.. ఆమె కన్ను స్నేహితురాలు మాఫ్రాపై పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి.. తన వద్దకు రప్పించుకుంది. ఆ తర్వాత తన భర్తతో కలిసి మాఫ్రాను ఇటుకలతో కొట్టి చంపేసింది. అనంతరం పదునైన కత్తితో మాఫ్రా కడుపును కోసి.. గర్భంలో ఉన్న నవజాత శిశువును దొంగిలించింది. ఆ తర్వాత మాఫ్రా శవాన్ని ఆమె ఇంటికి సమీపంలోని ఓ యార్డులో పడేసి పారిపోయారు. 
 
ఈ శవాన్ని ఆమె భర్తతో పాటు.. తల్లి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. స్వల్ప గాయాలతో ఉన్న నవజాత శిశువును కూడా స్వాధీనం చేసుకున్నారు. తనకు జనవరిలో గర్భస్రావం అయిందని, శిశువును దొంగిలించేందుకే మాఫ్రాను చంపేశానని నిందితురాలు పోలీసులకు చెప్పింది.