గురువారం, 28 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 26 ఆగస్టు 2025 (12:01 IST)

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

Raviteja - Mass Jatara
Raviteja - Mass Jatara
మాస్ మహారాజా రవితేజ  'మాస్ జతర' చిత్రం ఆగస్టు 27వ తేదీన థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవల పరిశ్రమ వ్యాప్తంగా జరిగిన సమ్మెలు కారణంగా కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో సాంకేతిక సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఊహించని జాప్యం జరిగింది.

అందుకే సినిమాను అనుకున్న తేదీకి సకాలంలో సిద్ధం చేయలేకపోయామని నిర్మాతలు అధికారికంగా తెలిపారు. కంగారుగా సినిమాని విడుదల చేయడం కంటే.. కాస్త సమయం తీసుకొని అత్యుత్తమ చిత్రంగా మలిచి, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు.
 
మాస్ జతార చిత్రాన్ని అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రతి విభాగం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, త్వరలోనే ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. అభిమానులు నిరీక్షణకు బహుమానంగా త్వరలో ఆశ్చర్యకర కంటెంట్ రాబోతుందని నిర్మాతలు హామీ ఇచ్చారు.