1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Germany Passes 1 Million Covid Cases Since Start of Pandemic

జర్మనీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 22వేల కోవిడ్ కేసులు

Germany
కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో విజృంభిస్తోంది. తాజాగా జర్మనీలో కరోనా రక్కసి విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం జర్మనీలో కరోనా కేసులు మిలియన్ మార్క్‌ను దాటాయి. ఈ దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 22,806 కొత్త కేసులు నమోదైనట్లు రాబర్ట్ కొచ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు కొవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య 10,06,394కు చేరింది. 
 
అలాగే శుక్రవారం ఒకేరోజు 426 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 15,586కు చేరింది. కొన్ని వారాల క్రితం వరకు వందల సంఖ్యలో నమోదవుతున్న డైలీ కేసులు ప్రస్తుతం వేలల్లోకి చేరింది. 
 
ఇక దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ప్రధానంగా జనాభా అధికంగా ఉండే నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్రంలోనే నాల్గో వంతు పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత బవేరియాలో 1,98,000 కేసులు... బెర్లిన్‌లో 62,000 కేసులు నమోదయ్యాయి.
తర్వాతి కథనం
బాబాయ్ - అబ్బాయ్‌ చేతివాటం.. బ్యాంకుకు కన్నంవేసి.. డబ్బు శ్మశానంలో దాచిపెట్టారు..