గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2020 (13:41 IST)

చెప్పిన మాట వినరా..? పాకిస్థాన్ క్రికెటర్లకు కివీస్ వార్నింగ్.. ఆరుగురికి కరోనా

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు చేసిన ఒక పని తీవ్ర విమర్శలకు దారి తీసింది. కరోనా తీవ్రత ఉన్నా సరే వారు లెక్క చేయకుండా వ్యవహరించిన తీరు కరోనా నిబంధనలను ఉల్లఘించడం విమర్శలకు వేదికగా మారింది. మొత్తం నాలుగు నిభంధనలను ఉల్లంఘించడంతో మొత్తం ఆరుగురు ఆటగాళ్లకు కరోనా సోకింది. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డ్ సీఈఓ వసీం ఖాన్ వెల్లడించారు.
 
న్యూజిలాండ్ ప్రభుత్వం వారికి చివరి వార్నింగ్ ఇచ్చిందన్నారు. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కచ్చితంగా వారిని ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. తాను న్యూజిలాండ్ ప్రభుత్వంతో మాట్లాడానని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ సిరీస్‌లో ఎలాంటి ఇబ్బందులు రాలేదని చెప్పుకొచ్చారు. 
 
ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కూడా ధ్రువీకరించింది. ప్రస్తుతం వారంతా క్రైస్ట్‌చర్చిని ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. టూర్లో భాగంగా కివీస్-పాకిస్థాన్‌ జట్లు డిసెంబరు 10 నుంచి మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్నాయి.