జూన్ 21న కొత్త కరోనా కేసులెన్ని... 88 రోజుల కనిష్ట స్థాయిలో...
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. మరోవైపు, థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అంటే జూన్ 21వ తేదీన దేశంలో కొత్తగా మరో 53256 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి 88 రోజుల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
దేశంలో గత 24 గంటల్లో 53,256 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం... ఆదివారం 78,190 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,35,221కు చేరింది. మరో 1,422 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,88,135కు పెరిగింది.
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,88,44,199 మంది కోలుకున్నారు. 7,02,887 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. వ్యాక్సినేషన్ కు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 28,00,36,898 డోసులు ఇచ్చారు.
మరోవైపు, దేశంలో ఆదివారానికి మొత్తం 39,24,07,782 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 13,88,699 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.