సంబంధిత వార్తలు
- ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న హిట్‌మ్యాన్ : కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ!?
- డబ్ల్యూటీసీ ఫైనల్ గణాంకాలు : ఆ మూడు జట్ల పరిస్థితి ఏంటి?
- బీసీసీఐ తదుపరి కార్యదర్శి ఎవరు?
- ఇంకా ఏం చూడాలి దేవుడా చెప్పు.. నేను ఇంకా ఎన్ని రన్స్ సాధించాలి : పృథ్వీ షా
- దిగివచ్చిన పాకిస్థాన్.. అప్పటివరకు హైబ్రిడ్ విధానంలోనే మ్యాచ్‌ల నిర్వహణ
బీసీసీఐ కొత్త కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా
భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా ఎంపికకానున్నారు. ఈ పోస్టుల దరఖాస్తుల దాఖలు ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగియగా, ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే, ఈ విషయాన్ని మాత్రం ఈ నెల 12వ తేదీన జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తారు.
ఈ నెల 12వ తేదీన ముంబైలో బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారంతో ముగిసింది. కార్యదర్శి పదవికి ప్రస్తుత తాత్కాలిక కార్యదర్శిగా ఉన్న దేవ్‌జిత్ సైకియా (అస్సాం), కోశాధికారి పదవి కోసం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రభతేజ్‍లు నామినేషన్లు దాఖలు చేశారు.
శనివారం సాయంత్రం నామినేషన్ల స్వీకరణ ముగిసే సమయానికి వీరిద్దరే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరు ఇద్దరూ ఆయా పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనప్రాయమైంది. 12వ తేదీన జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి వీరిరువురి ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇటీవలి కాలం వరకూ బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నిక అవ్వడం, బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన అశిష్ షెలార్ మహారాష్ట్రలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కార్యదర్శి, కోశాధికారి ఎన్నికల ప్రక్రియను బీసీసీఐ చేపట్టింది.
