1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Dhruv Jurel equals MS Dhoni's incredible feat in Duleep Trophy

దులీప్ ట్రోఫీ: అత్యధిక క్యాచ్‌లు.. ధోనీ రికార్డ్ సమం చేసిన ధ్రువ్

Dhoni
దులీప్ ట్రోఫీలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీ సరసన ధ్రువ్ జురెల్ నిలిచాడు. 2004-05 సీజన్‌లో ఈస్ట్ జోన్ తరఫున ధోనీ ఈ ఘనత సాధించాడు. రెండు దశాబ్దాల తర్వాత ఈ రికార్డును ఇండియా-ఏ తరఫున ధ్రువ్ సమం చేశాడు. ఇక తర్వాతి స్థానాల్లో బెంజమిన్ (6 క్యాచ్‌లు, 1973-74), విశ్వనాథ్ (6 క్యాచ్‌లు, 1980-21) ఉన్నారు. 
 
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆఖరి రోజు అయిన ఇవాళ ఆటలో మిగిలిన 78 ఓవర్లలో.. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టు 76 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియా-బీ 321 పరుగులు చేసింది. 
 
ముషీర్ ఖాన్ (181; 373 బంతుల్లో, 16 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం బాదాడు. ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (37) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్, నవదీప్ సైని చెరో మూడు, సాయి కిశోర్ రెండు వికెట్లు తీశారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. జట్టులోకి రిషబ్ పంత్.. షమీ అవుట్