1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Williamson, Broom secure New Zealand's 3-0 sweep

క్రికెట్ 2016 : క్రికెట్ ప్రపంచంలో చివరి గెలుపు న్యూజిలాండ్‌దే...

2016 సంవత్సరాన్ని న్యూజిలాండ్ జట్టు విజయంతో ముగించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన చివరి వన్డేలో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో విజ

New Zealand's 3-0 sweep
2016 సంవత్సరాన్ని న్యూజిలాండ్ జట్టు విజయంతో ముగించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన చివరి వన్డేలో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. 
 
ఓఫెనర్లు తమీమ్ 59, ఇమ్రూల్ కైస్ 44, నురుల్ హసన్ 44 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో హెన్రీ, సాంట్నర్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం 237 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ 41.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ 95 నాటౌట్, బ్రూమ్ 97, నీషమ్ 28, రాణించారు.
 
లాథమ్ 6 పరుగులు చేసి ఔట్ కాగా, 4 పరుగులు చేసిన గుప్టిల్ గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. త్వరలో జరిగే టీ-ట్వంటీ సిరీస్‌కు సైతం అతను దూరమయ్యాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ-ట్వంటీ సిరీస్ జనవరి 3 నుంచి ప్రారంభంకానుంది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
41వ వసంతోకి టైగర్ వుడ్స్.. 466 రోజుల విశ్రాంతికి తర్వాత గోల్ఫ్ పునారగమనం..