మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (15:29 IST)

కోరిక తీర్చలేదని మహిళను నరికేసి... మృతదేహాన్ని కౌగలించుకున్న కామాంధుడు

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళ తన కోరిక తీర్చలేదన్న అక్కసుతో ఆమెను నరికేసిన ఓ కామాంధుడు.. ఆ తర్వాత శవాన్ని కౌగలించుకుని తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఈ దారుణం రాష్ట్రంలోని అహోర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని థ‌న్వారా ఏరియాలో సోమవారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, థ‌న్వారా ఏరియాకు చెందిన వివాహిత‌ మ‌హిళ శాంతిదేవి (32) స్థానికంగా త‌న ఇద్ద‌రు కొడుకుల‌తో క‌లిసి నివాసం ఉంటుంది. ఆమె భ‌ర్త మ‌హారాష్ట్రలో ప‌నిచేస్తూ అప్పుడ‌ప్పుడు వ‌చ్చి భార్య‌కు డ‌బ్బులు ఇచ్చి వెళ్తుంటాడు. ఈ క్రంలో అదే ప్రాంతానికి చెందిన గ‌ణేశ‌ర‌మ్ (22) అనే యువ‌కుడి క‌న్ను శాంతిదేవిపై ప‌డింది. 
 
గ‌త కొన్ని రోజులుగా ఆమెను లైంగికంగా వేధింపుల‌కు గురిచేస్తూ వచ్చాడు. తన కోరిక తీర్చాలంటూ ఆమె వెంటపడసాగాడు. అయితే ఆమె అందుకు అంగీకరించలేదు. దాంతో గ‌ణేశ‌ర‌మ్ ఆమెపై ప‌గ పెంచుకున్నాడు. సోమవారం ఉద‌యం మ‌హాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం ప‌నికి వెళ్లిన శాంతిదేవిని అంద‌రి ముందే క‌త్తితో నరికిచంపాడు. ఆ త‌ర్వాత ఆమె మృత‌దేహాన్ని కౌగిలించుకుని ప‌డుకున్నాడు.
 
దాంతో తీవ్ర‌ భ‌యాందోళ‌న‌కు గురైన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే అక్క‌డికి చేరుకున్న పోలీసులు నిందితుడి నుంచి శాంతిదేవి మృత‌దేహాన్ని విడిపించి పోస్టు మార్టానికి త‌ర‌లించారు. నిందితుడు గ‌ణేశ‌ర‌మ్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.