శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ సైకోను గ్రామస్థులు మట్టుబెట్టారు. సైకోలా ప్రవర్తిస్తూ కొడవలితో దాడికి పాల్పడుతున్న వ్యక్తిపై దాడి చేయగా గాయాలపాలై మృతి చెందాడు. శ్రీసత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం గాడ్రాళ్లపల్లి ఢిల్లీలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బావిరెడ్డి (48) 2007లో గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో ఆరేళ్లు జైళు శిక్ష అనుభవించి వచ్చాడు. అప్పటి నుంచి అతని మానసిక స్థితి బాగోలేదని...