1. ఆధ్యాత్మికం
  2. »
  3. భవిష్యవాణి
  4. »
  5. ఫెంగ్ షుయ్

దంపతులిద్దరూ ఉద్యోగస్తులా?

ఆధ్యాత్మికం భవిష్యవాణి ఫెంగ్షుయ్ దంపతులిద్దరు ఉద్యోగస్తులా అనారోగ్యం ఆదాయం ఇబ్బందులు అనుకూల దిశ మంచం
FILE
ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దంపతులిద్దరూ ఉద్యోగం చేయడం ప్రస్తుతం పరిపాటైంది. కుటుంబాన్ని సక్రమంగా నడిపేందుకు భార్యభర్తలిద్దరూ ఉద్యోగంలో స్థిరపడ్డారా? అలాంటి వారు మీరైతే... ఫెంగ్‌షుయ్ పేర్కొన్న కొన్ని చిట్కాలు మీ కోసం... దంపతులిద్దరూ ఉద్యోగస్తులైన పక్షంలో... ఉన్నట్టుండి ఒకరికి అనారోగ్యం, మరొకరికి ఆదాయంలో ఇబ్బందులు తలెత్తినట్లైతే మీకు కలిసి వచ్చే నాలుగు దిక్కులను ఎంచుకోండి.

అలాగే ఎలాంటి సమస్య వచ్చిందో దానికి సంబంధించిన దిశ ఏదో చూసుకోండి. సమస్య వచ్చిన దిశలో... ఇద్దరికీ కలిసి వచ్చే దిశ కనీసం ఒక్కటైనా.. అందులో తప్పకుండా ఉంటుంది. ఆ దిశవైపు మంచాన్ని జరుపుకుంటే ఆదాయంలో ఏర్పడిన ఇబ్బందులు తలెత్తవు. ఇలా చేస్తే ఉద్యోగం చేసే దంపతుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఫెంగ్‌షుయ్ శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అలాగే.. సాధారణంగా దంపతులిద్దరిలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు... అనారోగ్యంతో బాధపడుతున్న భాగస్వామికి అనుకూలమైన దిశలో మీ మంచాన్ని మార్చండి. దీనివలన మీరు వాడుతున్న మందులు మరింత ప్రభావంతో పనిచేసి తొందరగా కోలుకునేందుకు ఉపకరిస్తుంది.

అదే విధంగా... వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా అనుకూల దిశవైపు మంచాన్ని జరుపుకుంటే మెరుగైన ఫలితాలు అనుకూలిస్తాయి.