1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Iran warns it will target Israel's secret nuclear sites if attacked

ఇజ్రాయేల్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్...

iran warns israel
ఇజ్రాయేల్ అణు కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు ఇరాన్ సాయుధ దళాలు హెచ్చరికలు చేశాయి. ఈ మేరకు ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. 
 
ఇజ్రాయేల్‌కు చెందిన సున్నితమైన నిఘా సమాచారం తమకు లభించిందని ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో ఈ తాజా హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
నిఘా వర్గాల ద్వారా సేకరించిన సమాచారంతో ఇజ్రాయేల్‌లోని కీలక లక్ష్యాలను గుర్తించామని ఎస్ఎన్ఎస్సి తెలిపింది. ఇరాన్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయేల్ ఏదైనా సైనిక చర్యకు దిగితే, ఈ లక్ష్యాలపై ప్రతీకార దాడులు చేయడానికి తమ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
 
"శత్రు దేశాల నుంచి వస్తున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడానికి, అలాగే ఇరాన్ నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి చేపట్టిన విస్తృత వ్యూహాత్మక చర్యలలో ఇది ఒక భాగం" అని ఆ మండలి వివరించింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రూ.13 లక్షల వస్తువులతో క్యూడిన బ్యాగును తిరిగిచ్చేసిన ఆటో డ్రైవర్