1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Amazing health benefis of apple

ప్రతిరోజూ యాపిల్ పండును తీసుకుంటే?

యాపిల్ పండ్లు ఇంచుమించుగా అన్ని సీజన్స్‌లోనూ దొరుకుతాయి. యాపిల్ పండులో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఒక యాపిల్‌లో ఒక మిల్లీగ్రామ్ ఇనుము, పధ్నాలుగు మిల్లీగ్రాముల పాస్పరస్, పది మిల్లీగ్రాముల క్యాల్షియం, ఉంట

apple
యాపిల్ పండ్లు ఇంచుమించుగా అన్ని సీజన్స్‌లోనూ దొరుకుతాయి. యాపిల్ పండులో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఒక యాపిల్‌లో ఒక మిల్లీగ్రామ్ ఇనుము, పధ్నాలుగు మిల్లీగ్రాముల పాస్పరస్, పది మిల్లీగ్రాముల క్యాల్షియం, ఉంటాయి. యాపిల్ రక్తక్షీణతను నివారిస్తుంది. రక్తక్షీణతగలవారు కనీసం రోజుకు మూడు యాపిల్స్ తీసుకుంటే మంచిది.
 
చంటిపిల్లలకు విరేచనాలవుతున్నప్పుడు యాపిల్ జ్యూస్ తాగిస్తే విరేచనాలు అరకడుతాయి. యాపిల్ జ్యూస్‌లో యాలకులు, తేనె కూడా కలుపుకుని తీసుకుంటే కడుపులో మంట, పేగుల్లో పూత, అజీర్తి, గ్యాస్‌ట్రబుల్, గుండెలో మంటను నివారిస్తాయి. యాపిల్‌లో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన బీపీతోపాటు అన్ని హృదయ వ్యాధులను, మూత్రపిండాల వ్యాధులను అరికడుతుంది.
 
యాపిల్‌ను ముక్కలుగా కోసి ఉడికించి రోజూ తీసుకుంటే శరీరంలో బొల్లిమచ్చలు నివారణవుతాయి. యాపిల్ చెట్టు వేళ్ళ రసాన్ని త్రాగితే కడుపులో ఏలికపాములు నశిస్తాయి. కామెర్ల వ్యాధిలో వీలైనంత యాపిల్ రసాన్ని తాగుతుంటే లివర్‌ను సంరక్షిస్తుంది. నాడీ సంబంధ వ్యాధులు, మెదడు వ్యాధులు కలవారికి యాపిల్ చాలా మేలు చేస్తుంది.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
బేబీకార్న్, క్యాప్సికమ్ శాండ్‌విచ్ ఎలా చేయాలో చూద్దాం.. (video)