1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Why is monosodium glutamate said to be so harmful?

సైలెంట్ కిల్లర్... టేస్టింగ్ సాల్ట్

వంటల్లో రుచి కోసం వివిధ రకాల పొడులను చల్లుతుంటారు. ఇలాంటి వాటిలో మోనోసోడియం గ్లూటమేట్ (ఎంఎస్‌జీ) ఒకటి. అంటే ఇదో రకమైన ఉప్పు. అదే.. టేస్టింగ్ సాల్ట్. ఇది టేస్టింగ్ సాల్ట్ కాదు.. విష పదార్థం.

monosodium glutamate
వంటల్లో రుచి కోసం వివిధ రకాల పొడులను చల్లుతుంటారు. ఇలాంటి వాటిలో మోనోసోడియం గ్లూటమేట్ (ఎంఎస్‌జీ) ఒకటి. అంటే ఇదో రకమైన ఉప్పు. అదే.. టేస్టింగ్ సాల్ట్. ఇది టేస్టింగ్ సాల్ట్ కాదు.. విష పదార్థం. 
 
ఈ సాల్ట్‌ను ప్రధానంగా హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీల తయారు చేసే ఆహార పదార్థాలలో విరివిగా వాడుతారు. దీనివాడకంతో చక్కని రుచి వస్తుంది. అదేసమయంలో ఎంఎస్‌జీ వేసిన ఆహారాలను ఆరగించడం వల్ల ఆరోగ్యానికి కలిగే హాని ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
* ఎంఎస్‌జీ ఉన్న ఆహారాలను అధికంగా ఆరగించడం వల్ల ఊబకాయానికి గురవుతాం. పలు మెటబాలిక్ సమస్యలు వస్తాయి. 
* ఎంఎస్‌జీ ఎక్కువగా తినడం వల్ల మైగ్రేన్, బద్దకంగా ఉండటం, హార్మోన్ల అసమతుల్యత, వికారం, నీరసం, ఛాతి నొప్పి తదితర సమస్యలు. 
* ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 లక్షల టన్నుల సోడియం గ్లూటమేట్‌ను ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయి. 
* ఎంఎస్‌జీ నాలుకపై ఉండే రుచి కళికలను సైతం మరింతగా ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఆహారం అధికంగా ఆరగిస్తాం. ఫలితంగా బరువు పెరుగుతాం.
* ఎంఎస్‌జీ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకుంటుంటే హైబీపీ, డయాబెటిస్, కండరాలు ముడుచుకుపోవడం, కాళ్లు, చేతుల్లో సూదులు గుచ్చినట్లు అనిపించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. 
* సాస్‌లు, చిప్స్, ప్రిపేర్డ్ సూప్స్, హాట్ డాగ్స్, బీర్లు, క్యాన్డ్ ఫుడ్స్ తదితర ఆహారాల్లోనూ విరివిగా ఉపయోగిస్తారు. మొత్తంమీద అతిగా తింటే మాత్రం పైన చెప్పిన విధంగా అనర్థాలు కలుగుతాయి. 
 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
గోళ్లకు నెయిల్ ఆర్ట్ ఎలా వేసుకోవాలో తెలుసా?