సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (18:55 IST)

మలేరియాకు కొత్త మందు.. ఎవరు కనిపెట్టారు?

మలేరియాకు కొత్త మందును అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. మలేరియా కారక క్రిములను పూర్తిగా నిర్మూలించగల సరికొత్త మందును వీరు ఆవిష్కరించారు. అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ

మలేరియాకు కొత్త మందును అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. మలేరియా కారక క్రిములను పూర్తిగా నిర్మూలించగల సరికొత్త మందును వీరు ఆవిష్కరించారు. అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ మందును కనిపెట్టారు.
 
ఇది ఎలుకల్లో మలేరియా పరాన్నజీవిని పూర్తిగా తుదముట్టించడంతో కొత్త వ్యాక్సిన్‌ తయారీకి మార్గం సుగమమైంది. మలేరియా పరాన్నజీవి ముందు ఒక ప్రొటీన్‌ను విడుదల చేస్తుంది. అది మనకు వ్యాధుల నుంచి రక్షణగా నిలిచే టి-సెల్స్‌ జ్ఞాపక శక్తిని హరించేస్తుంది. ఆపై మలేరియా విజృంభిస్తుంది. 
 
తాజాగా కనిపెట్టిన మందు ఆ ప్రొటీన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మందుకు మరిన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే జనబాహుళ్యంలో అందుబాటులోకి తెస్తామని వైద్యులు వెల్లడించారు.