గుండెకూ ఓ డైట్ ఉంది గురూ?
ఇటీవలికాలంలో గుండెజబ్బులబారిన పడి చనిపోయేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఇష్టానుసారంగా జంక్ ఫుడ్స్ తినడం, వేళకు పుష్టికరమైన ఆహారం తీసుకోక పోవడం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం, వ్యాయామ
ఇటీవలికాలంలో గుండెజబ్బులబారిన పడి చనిపోయేవారి సంఖ్య పెరిగిపోతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఇష్టానుసారంగా జంక్ ఫుడ్స్ తినడం, వేళకు పుష్టికరమైన ఆహారం తీసుకోక పోవడం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, గుండె పదిలంగా పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఖచ్చితంగా డైట్‌ను ఫాలో అవ్వాల్సిందే. ఆ డైట్ ఏంటో పరిశీలిద్ధాం.
* శరీరం బరువు పెరగడం, నడుము భాగం పెరిగిందని భావిస్తే డైట్‌లో మార్పులు చేసుకోవాల్సిందే.
* రోజూ తీసుకునే ఆహారంలో చక్కెర, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటే అనారోగ్యం బారిన పడటం ఖాయం.
* బరువు తక్కువగా ఉంటేనే గుండె దిటువుగా ఉంటుంది.
* గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రకరకాల కూరగాయలు, పళ్లు తినాల్సిందే.
* వాటిని సహజరీతిలో తీసుకోవడమే మంచిది.
* వాల్‌నట్స్, ఆల్మండ్స్, బెర్రీలు, అవిసె గింజలు, పాలకూర, బ్రకోలీ వంటివాటిని డైట్‌లో చేర్చాలి
* చేపలు, ఆలివ్ ఆయిల్, కూరగాయలు, బీన్స్, నట్స్ మిశ్రమంతో మెనూ రూపొందించుకోవాలి.
* చియా సీడ్స్, బ్లూ బెర్రీస్, టొమాటోలు, నిమ్మజాతి పళ్లు, అవొకడోలు ఖచ్చితంగా గుండె డైట్‌లో చేర్చాలి.
* టొమాటోలోని పొటాషియం చెడు కొలెస్ట్రాల్‌ను పోగొడుతుంది.
* ఇక నిమ్మపళ్లలో ఉండే విటమిన్ సి గుండెజబ్బుల రిస్క్‌ను తగ్గిస్తుంది.
* వీటన్నింటిని డైట్‌లో చేర్చడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్