సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By pnr
Last Updated : గురువారం, 12 జులై 2018 (10:38 IST)

వర్షాకాలంలో చిన్నపిల్లలకు సేఫ్టీ టిప్స్...

సాధారణంగా వర్షాకాలంలో నేల చిత్తడిగా మారిపోతుంది. అలాంటి నేలపై చిన్నపిల్లలు ఆడుకుంటూ జారి కిందపడిపోతుంటారు. దీంతో చిన్నపాటి దెబ్బలు కూడా తగులుతుంటాయి. అలాగే, వర్షాకాలంలో చిన్నపిల్లల కోసం కొన్ని సేఫ్టీ

సాధారణంగా వర్షాకాలంలో నేల చిత్తడిగా మారిపోతుంది. అలాంటి నేలపై చిన్నపిల్లలు ఆడుకుంటూ జారి కిందపడిపోతుంటారు. దీంతో చిన్నపాటి దెబ్బలు కూడా తగులుతుంటాయి. అలాగే, వర్షాకాలంలో చిన్నపిల్లల కోసం కొన్ని సేఫ్టీ టిప్స్‌ను ఇక్కడ తెలుసుకుందాం. 
 
* తడి నేల మీద జారకుండా పట్టు దొరికే షూస్, చెప్పులు వేయాలి. 
* అడుగు బాగం గరుకుగా, నొక్కులుండాలి. 
* దోమల నివారణకు వాడే కృత్రిమ పరికరాల నుంచి వెలువడే వాయువులు పిల్లలకు ఆరోగ్యకరం కాదు. 
* రాత్రంతా అదే గాలి పీల్చడంతో ఆ దుష్పభావం ఊపిరితిత్తుల మీద పడుతుంది. 
* ఒక కప్పు నీటిలో ఒక ముక్క కర్పూరం వేసి గదిలో ఒక మూల పెడితే దోమలు రావు. 
* చంటి పిల్లలకు మసాజ్‌ చేసేటప్పుడు మసాజ్‌ చేసే ఆయిల్‌ను గోరువెచ్చగా వేడి చేసి వాడాలి. 
* చిన్న పిల్లలున్న ఇంట్లో ప్రతి పనినీ కేర్‌ఫుల్‌గానే చేయాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ... ఇంట్లో రోజంతా కేరింతలు ఉండాలంటే ఈ మాత్రం కేర్‌ తీసుకోవాల్సిందే.