1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Black grape juice Health benefits

చలికాలంలో నల్లద్రాక్ష రసంతో మేలెంతో తెలుసా?

Black grapes
నల్లద్రాక్షలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కాలేయానికి ద్రాక్షలు అవీ ఎండు ద్రాక్షలు ఎంతో మేలు చేస్తాయి. రాత్రి పూట ద్రాక్షలను అంటే ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఆ నీటిని, ద్రాక్షలను తీసుకోవడం ద్వారా కాలేయం శుభ్రమవుతుంది. కాలేయాన్ని ఆరోగ్యాన్ని వుంచుకుంటే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. 
 
డయాబెటిస్ దూరంగా వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా నల్లద్రాక్ష రసం శ్వాసకోశాల్లో పేరుకుపోయిన కఫాన్ని ఇది తొలగిస్తుంది. అందుకే చలికాలంలో నల్లద్రాక్ష రసాన్ని తీసుకోవడం.. నల్లద్రాక్షలను నీటిలో నానబెట్టి తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
అంతేగాకుండా.. పొడిదగ్గు ఉంటే, బాదం గింజల్ని రెండు గంటల పాటు నీళ్లల్లో నానపెట్టి తినేయవచ్చు. ఉల్లిగడ్డను దంచి, దాంట్లో నిమ్మరసం కలిపి, నీళ్లల్లో మరిగించి తీసుకుంటే త్వరితంగా ఉపశమనం లభిస్తుంది. పసుపు చెట్టు వేర్లను ఎండబెట్టి, పొడి చేసి, తేనెతో కలిపి తీసుకుంటే చలికాలంలో జలుబు, దగ్గు మాయమవుతాయి.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
లైంగిక శక్తిని పెంచే లేత కొబ్బరి.. (video)