ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 17 డిశెంబరు 2019 (19:44 IST)

నవ్వితే ఏమవుతుందో తెలుసా?

నవ్వును జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు. నవ్వడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. రక్తపోటు తగ్గుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. నవ్వు సీరమ్ కార్టిసాల్‌ను తగ్గించి టి లింఫోసైట్స్ పనితనాన్ని పెంచుతుంది. ఈ విషయం పరిశోధనల్లో రుజవయింది.
 
నవ్వు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా, వ్యాధి నుంచి కాపాడే ప్రొటీనులు, గామ్మా- ఇంటర్ ఫెరాన్, వ్యాధిని నయం చేసే యాంటీబాడీస్ బి-సెల్స్‌ను పెంచుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే మానసిక ప్రశాంతత అవసరం. మానసిక ప్రశాంతత వలన శరీరం తన పూర్వ స్థితిని పొందుతుంది. 
 
చురుకుగా, ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ ఉండటం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు. ఆరోగ్యంలో మంచి అభివృద్ధిని గమనించవచ్చు.