1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. health benefits of prawns

రొయ్యలు ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits Of Eating Prawns
రొయ్యలు. ప్రపంచంలోని అత్యంత రుచికరమైన, ప్రయోజనకరమైన మత్స్య సంపదలో ఒకటి. రొయ్యలు స్థూల, సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. రొయ్యలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రొయ్యలులో విటమిన్ B12 పుష్కలంగా వుంటుంది. విటమిన్ B12 లోపం బలహీనత, అలసట, డిప్రెషన్ వంటి వివిధ ఆరోగ్య సమస్యలున్నవారు రొయ్యలు తినాలి.
 
రొయ్యలు తక్కువ కేలరీల పోషకాహారం కలిగిన ఆహారం కనుక బరువు తగ్గించుకోవడంలో దోహదపడుతాయి. రొయ్యలు సెలీనియం యొక్క గొప్ప మూలం, ఇది శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. రొయ్యలు చర్మానికి ఎంతో మేలు చేసే విటమిన్-ఇని కలిగి ఉంటాయి కనుక వీటిని తింటే చర్మం ఆరోగ్యంగా వుంటుంది.
 
రొయ్యలలో జింక్ అధిక స్థాయిలో ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రొయ్యలలో కొవ్వు ఆమ్లం ఉంటుంది, ఇది అల్జీమర్స్ వ్యాధి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. రొయ్యలు కాల్షియం యొక్క గొప్ప మూలం. ఎముకల దృఢంగా వుండేందుకు రొయ్యలు తింటే మంచిది. ఏవైనా అరుదైన అలెర్జీలు లేదా వైద్య పరిస్థితులు, గర్భధారణ జరిగి ఉంటే, రొయ్యలు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
రుచికరమైన అల్పాహారాలు, ఏంటవి?