శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2016 (11:37 IST)

మహిళ అందం వక్షోజాల్లోనే... కారణమేంటో తెలుసా?

మహిళల్లో చాలామంది తమ అందం, ఆకర్షణ అంతా వక్షోజాలలోనే ఉన్నదని భావిస్తుంటారట. అందువల్ల వీటి రూపురేఖల గురించి ప్రియుడు లేదా భర్త మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలట. ఇలా పెట్టుకోకుండా తమకు తోచ

మహిళల్లో చాలామంది తమ అందం, ఆకర్షణ అంతా వక్షోజాలలోనే ఉన్నదని భావిస్తుంటారట. అందువల్ల వీటి రూపురేఖల గురించి ప్రియుడు లేదా భర్త మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలట. ఇలా పెట్టుకోకుండా తమకు తోచింది తోచినట్లు చెప్పేస్తే సదరు స్త్రీలు ఆత్మన్యూనతా భావంతో కొట్టుమిట్టాడుతూ భాగస్వామని తృప్తిపరచడంలో విఫలమవుతారట. ఇంతకీ వక్షోజాలకు సంబంధించి ఎలాంటి విషయాలు మాట్లాడకూడదో ఒక్కసారి చూద్దాం...
 
* తన ప్రేయసి లేదా భాగస్వామి వక్షోజాకృతులను కించపరుస్తూ మరొకరి వక్షోజ అందాలను పోల్చుతూ మాట్లాడరాదు.
 
* ఎద అందాలు ప్లాట్ గా ఉన్నాయనీ, ఇంక రెడీమేడ్ కప్పులే గతి అంటూ గేలి చేస్తూ విమర్శించరాదు. 
 
* కొంతమంది స్త్రీలు భర్త లేదా ప్రియుడు మెప్పు కోసం వక్షోజాకృతులను అందంగా తీర్చిదిద్దుకునేందుకు పలు రకాల మందులను ఉపయోగిస్తూ డబ్బు ఖర్చు చేస్తుంటారు. అలాంటి దానిని ఖండిస్తూ మాట్లాడరాదు. 
 
* ఎప్పుడైనా ఏకాంతంలో వక్షోజాలు కనబడేట్లు ఆమె ప్రవర్తిస్తే మెచ్చుకోకపోయినా ఫర్లేదు కానీ కించపరుస్తూ మాట్లాడరాదు. అలా చేస్తే ఆమె మనసు గాయపడుతుంది. 
 
* వక్షోజ సైజులు గురించి తరచూ మాట్లాడటం, పొద్దస్తమానం వాటి గురించి ధ్యాసంతా అన్నట్లు ఉండరాదు.