శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (17:23 IST)

గర్భంతో ఉన్నారా..? బరువు, ఎత్తుని బట్టి ఆహారాన్ని తీసుకోండి.

గర్భం ధరించిన తొలి ఐదు నెలల్లో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. మాంసాన్ని దూరంగా ఉంచాలి. సీఫుడ్‌ అంతగా తీసుకోకూడదు. అయితే తృణధాన్యాలు, పప్పులు, పప్పు దినుసులు తినటానికి ప్రయత్నించండి. ఇవి గర్భస్థ శ

గర్భం ధరించిన తొలి ఐదు నెలల్లో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. మాంసాన్ని దూరంగా ఉంచాలి. సీఫుడ్‌ అంతగా తీసుకోకూడదు. అయితే తృణధాన్యాలు, పప్పులు, పప్పు దినుసులు తినటానికి ప్రయత్నించండి. ఇవి గర్భస్థ శిశువు పెరుగుదలకు ఉపకరిస్తుంది. 
 
అలాగే కార్బోనేటేడ్ ద్రావణాలు, పొగ త్రాగటం, ఆల్కహాల్ని తీసుకోవటం మానేయండి. వీటి వలన గర్భస్థ సమయంలో చాలారకాల ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తుంది.
 
5వ నెల గర్భస్థ సమయంలో ఎక్కువగా బరువు పెరుగుతారు. కాబట్టి వెన్న, 'సాచురేటేడ్ ఫాట్'ని కలిగి ఉండే ఆహారాన్ని, ఆయిల్స్‌ని తినకండి. అనుకూలమైన, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినండి. తీసుకునే ఆహారంలో ఎక్కువగా హోల్ గ్రైన్స్, ఆరోగ్యవంతమైన ప్రోటీన్స్, ఆయిల్స్, పండ్లు, కూరగాయలనుని ఉండేలా చూసుకోండి.
 
గర్భస్థ సమయంలో బరువు ఎత్తుని బట్టి ఆహారాన్ని ఎంచుకోవటం చాలా మంచిది. వైద్యుల సలహాల మేరకు సాధారణ బరువు, ఎత్తు ఉన్న మహిళలు రోజు 200 -250 గ్రాముల హోల్ గ్రైన్స్, 192 గ్రాముల ప్రోటీన్స్, 8 చెంచాల ఆరోగ్యవంతమైన ఆయిల్, 3 కప్పుల పాల పదార్థాలు, 5 కప్పుల పండ్లు, కూరగాయలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.