రోజూ గుప్పెడు వేరుశెనగలను తింటే.. అది 100 వయాగ్రాలకు సమానమట...?
నాగరికత పెరుగుతున్న కొద్దీ.. ఆహారపు అలవాట్లలో ఏర్పడిన మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు వెతుక్కుంటూ వస్తున్నాయి. వీటిలో వీర్యలోపం, సంతానలేమి వంటివి కూడా ఉన్నాయి. పోషకాహారం తీసుకోకపోవడంతో లైంగిక సమస్యలు
నాగరికత పెరుగుతున్న కొద్దీ.. ఆహారపు అలవాట్లలో ఏర్పడిన మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు వెతుక్కుంటూ వస్తున్నాయి. వీటిలో వీర్యలోపం, సంతానలేమి వంటివి కూడా ఉన్నాయి. పోషకాహారం తీసుకోకపోవడంతో లైంగిక సమస్యలు ఏర్పడతాయి. అందుకే తీసుకునే ఆహారంపై కన్నేసి వుంచితే అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. ఇంకా లైంగికపరమైన ఇబ్బందులు కూడా దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
లైంగిక సమస్యలతో బాధపడేవారు.. వేరుశెనగలను రోజూ గుప్పెడు తీసుకుంటే మంచిది. వేరుశెనగలను రోజూ తీసుకుంటే అది 100 వయాగ్రాలకు సమమని తాజా పరిశోధనలో వెల్లడి అయ్యింది. వేరుశెనగల్లో పోషకాలు పుష్కలంగా ఉండటంతో అవి శారీరకంగా బలాన్నిస్తాయి. వీర్యలోపాలను తొలగిస్తాయని పరిశోధనలో తేలింది. వేరుశెనగలను ఉడికించి తీసుకోవడం ద్వారా శరీరానికి ప్రోటీన్లు అందుతాయి.
వేరుశెనగలు మెదడుకు ఉత్తేజాన్నిస్తాయి. అలసటను తొలగించి.. చురుకుగా ఉండేలా చేస్తుంది. వేరుశెనగల పొడిని పాలులో ఉడికించి తీసుకుంటే వీర్యవృద్ధి జరుగుతుంది. మాంసాహారంలో ఉండే అన్నీ ప్రోటీన్లు వేరుశెనగల్లో ఉన్నాయి. మధుమేహాన్ని వేరుశెనగలు నియంత్రిస్తాయి. ఇంకా హృద్రోగ సమస్యలు, క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.