పెళ్ళి హడావుడి... ఆపై శోభనం.. కొత్త దంపతులకు నిద్రలేదా.. ఐతే నష్టమే..
పెళ్ళి హడావుడి... ఆపై శోభనం.. ఇలా పెళ్లయిన కొత్తలో కొత్త జంట నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. అయితే కొత్త జంట హాయిగా నిద్రపోతేనే ఆరోగ్యానికి మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొత్తగా వైవాహిక జీవితంలో
పెళ్ళి హడావుడి... ఆపై శోభనం.. ఇలా పెళ్లయిన కొత్తలో కొత్త జంట నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. అయితే కొత్త జంట హాయిగా నిద్రపోతేనే ఆరోగ్యానికి మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొత్తగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వారికే సుఖనిద్ర చాలా చాలా అవసరమని, కొత్త దంపతులు సమయానికి నిద్రిస్తే పెళ్లి, దాంపత్యం, కుటుంబ వ్యవస్థలో చక్కగా ఇమిడిపోతారని ఫ్లోరిడా వర్శిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు.
దీనిపై నిర్వహించిన పరిశోధనలో కంటి నిండా నిద్రపోని వారు తమ భాగస్వామితో ఎదురయ్యే చిన్నపాటి చికాకులను సరిగ్గా అధిమించలేక పోతున్నట్లు గుర్తించారు. అలసిపోయిన శరీరం కుదుటపడేందుకు తగినంత విశ్రాంతి అవసరం. నిద్రతోనే శక్తి భర్తీ అవుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అందుకే పెళ్లైన భార్యాభర్తలకు నిద్ర చాలా అవసరమని పరిశోధకులు చెప్తున్నారు.
తర్వాతి కథనం