1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Onion juice for men and health benefits

ఉల్లిపాయ రసాన్ని దానితో కలిపి పురుషులు తీసుకుంటే...?

Onion juice
సాధారణంగా ఉల్లిపాయను కూరల్లో మాత్రమే వాడుకుంటామని మనందరికి తెలుసు. కానీ ఉల్లిపాయలో మనకు తెలియని చాలా మంచి ఔషధ గుణాలున్నాయి. ఉల్లిపాయ గురించి మూడు సూచనలు నిపుణులు చెప్పినవి అతి ముఖ్యమైనవి మనకు చాలా ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకుందాం.
 
1. ఉల్లిపాయ ఒక యాంటీబయోటిక్‌గా పని చేస్తుంది. ఉల్లిపాయను రెండు సమాన భాగాలుగా కట్ చేసి మన పక్కన పెట్టుకుంటే వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బులను దగ్గరికి రానియ్యవు. అంతేకాకుండా వచ్చిన జబ్బులను కూడా నయం చేస్తుంది.
 
2. ఉల్లిపాయను తరిగిన వెంటనే వాడుకోవాలి. ఎందుకుంటే ఉల్లిపాయ గాలిలోని బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది. కాబట్టి కోసిన తర్వాత చాలాసేపటికి వాటిని మనం తినకూడదు.
 
3. ఒక స్పూన్ ఉల్లిపాయ రసం, ఒకస్పూన్ ఆవునెయ్యి, అరస్పూన్ తేనెను ఉదయం, మద్యాహ్నం సమయాల్లో చప్పరిస్తూ, రాత్రి సమయంలో పాలు తాగితే పురుషుల్లో స్తంభన సమస్యను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది.
తర్వాతి కథనం
స్త్రీలకు ఆ సమస్య ఎందుకు వస్తుంది..?