1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
  4. 10 Powerful Health Benefits of Cumin

కడుపులో నులిపురుగులను నివారించే జీలకర్ర

Cumin
వంటల్లో ఉపయోగించే దినుసుల్లో జీలకర్ర ఒకటి. ఇందులో ఔషధ గుణాలు పుష్కలం. అవేంటో ఓసారి తెలుసుకుందాం. కడుపులో వికారంగా ఉండి పుల్లని తేనుపులతో బాధపడేవారు కొంచం జీలకర్రను నమిలి రసం మింగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది.
 
కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. దీనిని తరచూ నమిలి రసం మింగుతుంటే కడుపులో ఉన్న నులిపురుగులను నివారించడమే కాదు, ఉదర సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి. జీలకర్రను కషాయంగా కాచి తాగుతుంటే ఎలర్జీ వలన కలిగే బాధలు తగ్గుతాయి. నల్ల జీలకర్ర కషాయాన్ని సేవిస్తే షుగర్, బీ.పీ.ని అదుపులో ఉంచుతుంది.
 
నీళ్ళలో కొద్దిగా అల్లం వేసి బాగా వేడి చేయాలి. ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, గొంతు మంట, జలుబు, జ్వరం తగ్గుతాయి. కిడ్నీలకు రక్షణకల్పిస్తుంది. మూత్ర సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. 
 
జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని చిన్న చిన్న మాత్రలు చేసుకొని రెండు పూటలా రెండు మాత్రలు చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా, మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి. జీకలర్ర కిడ్నీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జీలకర్రకు వేడిచేసే గుణం వుంది. అందుకే అతిగా మాత్రం తీసుకోరాదు. 
తర్వాతి కథనం
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు?