ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (18:33 IST)

ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)

కొంతమందిని చూడగానే ఏదో తెలీని ఆకర్షణతో మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అది కూడా కొన్ని కొన్ని సమయాలలో జరుగుతుంది. దానినే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. ఈ ఆకర్షణను ఆకర్షణలో పడినవారు తప్పించి మరెవరూ అంగీకరించలేరు. 
 
అది కేవలం అందానికి సంబంధించినదికాదు. నవ్వు, నడక, అలంకరణ ఇలా ఏదైనా కావచ్చును. ఫలానా అంశం ఆకర్షించిందని వారు చెప్పలేరు. ఎందుకంటే నిజానికి బయటకు కనిపించని అంశాలు ప్రేమ, ఆకర్షణలో ఉంటాయి. అవి వారి జన్యువులలో నిక్షిప్తమై ఉంటాయి. అవతలివారి ప్రవర్తన, వారి శరీరంలో తయారయ్యే హార్మోన్లు వగైరాలు మ్యాచ్ అవుతాయి. అలాంటప్పుడే వారి మధ్య ఆకర్షణ ఏర్పడుతుంది. 
 
ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య కలిగే శారీరక, మానసిక ఆకర్షణలాంటిదే యువతీ యువకుల మధ్య జనించే ఆకర్షణలాంటి ప్రేమ లేదా ప్రేమలాంటి ఆకర్షణ. ఈ విధంగా ఆకర్షణను సృష్టించిన రసాయనక ప్రతిచర్యే ప్రేమ. 
 
ఒక వ్యక్తిని ఏం చూసి ప్రేమించావని ప్రేమికుడు/ప్రియురాలిని నిలదీస్తే... వారి దగ్గర నుంచి ఖచ్చితమైన సమాధానం రావడం కష్టమే. ఎందుకంటే ప్రత్యేకించి ఒక లక్షణానికి వారు బందీ అవరు. కనుక ఏమీ చెప్పలేరు. 
 
ఇలా బయటకు కనబడిన అంశాలు పాత్ర వహిస్తాయి కాబట్టి ప్రేమ గుడ్డిదనే నానుడి పుట్టింది.