ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (16:05 IST)

పురిటి నొప్పులు.. ఆ టెన్షన్ భరించలేక టెన్నిస్ ఆడాను.. సానియా మీర్జా

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ప్రెగ్నెన్సీ డేస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఇజాన్ పుట్టే రెండ్రోజుల ముందు కూడా తాను టెన్నిస్ ఆడినట్లు తాజాగా ఆమె బయటపెట్టింది. పురిటి నొప్పులను భరించలేక టెన్నిస్ ఆడానని చెప్పుకొచ్చింది. కడుపులో తొమ్మిది నెలల బిడ్డను మోయలేక.. చాలా అనారోగ్యం చెందినట్లు సానియా తెలిపింది.
 
ఎలాగైనా బిడ్డను ప్రసవించాలని.. ఆ టెన్షన్ భరించలేక.. ఆ భారం నుంచి బయటపడేందుకు టెన్నిస్ ఆడానని చెప్పింది. కనీసం అలా ఆడుతున్నందువల్లైనా... త్వరగా డెలివరీ అయిపోతుందేమోనని సానియా భావించింది. కానీ ఆమె అనుకున్నట్లు జరగలేదు. 
 
టెన్నిస్ ఆడినప్పుడు డెలీవరీ కాలేదు. కానీ... అలా ఆడటం వల్ల తాను మానసికంగా కాస్త ఉపశమనం పొందానని సానియా తాజాగా తెలిపింది. కాగా సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
ఈ దంపతులకు ఇజాన్ అనే కుమారుడు వున్నాడు. ఇంకా కొత్త షోలో ప్రెగ్నెన్సీకి సంబంధించి మరిన్ని విషయాలు చెప్పబోతోంది సానియా. ప్రెగ్నెన్సీ సమయంలో తనకు ఎలా అనిపించేదని, ఎలా బరువు పెరిగిందీ అన్నీ చెప్పబోతోందని సమాచారం.