ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (22:29 IST)

గర్భం రాకుండా మాత్రలు వేసుకునే మహిళలు తప్పక తెలుసుకోవాల్సినవి...

గర్భం రాకుండా ఇటీవలి కాలంలో చాలామంది యువతులు కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు. వాటిలో ఒకటి గర్భ నిరోధక మాత్రలను తీసుకోవడం. ఈ మాత్రలు కొందరిలో ఎలాంటి దష్ర్పభవాలను చూపకపోయినా మరికొందరిలో మాత్రం సమస్యలు తలెత్తుతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
 
1. తలనొప్పి, మైగ్రేన్
కొంతమంది వికారం, తలనొప్పి లేదా బరువులో తేడాలు తదితర దుష్ప్రభావాలను అనుభవిస్తారు. జనన నియంత్రణ మాత్రలలోని హార్మోన్లు తలనొప్పి మరియు మైగ్రేన్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. ఈ లక్షణాలు సాధారణంగా తలెత్తినా మెల్లగా తగ్గుతాయి. అలా కాకుండా తీవ్రమైన తలనొప్పి ప్రారంభమైతే వైద్య సలహా తీసుకోవాలి.
 
2. బరువు పెరుగుట
క్లినికల్ అధ్యయనాలు జనన నియంత్రణ మాత్రల వాడకం వల్ల బరువు హెచ్చుతగ్గుల వుంటాయన్నది నిర్థారించలేదు. అయినప్పటికీ రొమ్ముల వద్ద ద్రవంలా కనబడవచ్చు.
 
3. మూడ్ మార్పులు
నోటి గర్భనిరోధకాలు వినియోగించడం వల్ల మానసిక స్థితిపై ప్రభావం కలుగుతుంది. దీనివల్ల మాంద్యం లేదా ఇతర భావోద్వేగ మార్పుల ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పిల్ వాడకం సమయంలో మానసిక స్థితి మార్పులను ఎదుర్కొంటున్నవారు వైద్యులను సంప్రదించాలి.
 
4. రుతుక్రమంలో తేడాలు
మాత్ర వాడకంతో కొన్నిసార్లు రుతుక్రమంలో తేడాలు వస్తాయి. ఫలితంగా ఒత్తిడి, అనారోగ్యం, బడలిక లేదా హార్మోన్ల సమస్య, థైరాయిడ్ ఇబ్బందులు వచ్చే అవకాశం. పిల్ ఉపయోగిస్తున్నప్పుడు రావాల్సిన సమయానికి రుతుక్రమం రాకుండా తప్పిపోయినట్లయితే తదుపరి ప్యాక్ ప్రారంభించే ముందు గర్భ నిర్థారణ పరీక్షకు సిఫార్సు చేస్తారు. అందులో లేదని నిర్థారణ అయితే వైద్యల సూచనలు పాటించాలి.
 
5. శృంగార యావ తగ్గుతుంది
గర్భనిరోధక మాత్రలోని హార్మోన్ లేదా హార్మోన్లు కొంతమందిలో శృంగారంపై అనాసక్తిని కలిగిస్తుంది. ఈ కారణంగా భాగస్వామికి తీవ్రమైన అసహనం కలుగుతుంది. ఐతే ఇది గర్భ నిరోధక మాత్రల వల్లననే విషయాన్ని గమనించాలి. 
 
6. యోనిలో సమస్యలు...
మాత్ర తీసుకునేటప్పుడు యోనిలో మార్పులు సంభవించవచ్చు. ఇది యోని సరళతలో పెరుగుదల లేదా తగ్గుదల లేదా స్వభావంలో మార్పు కనబడవచ్చు. యోని పొడిబారడం వల్ల శృంగారం అసౌకర్యంగా మారుతుంది. ఈ మార్పులు సాధారణంగా హానికరం కాదు, కానీ రంగు లేదా వాసనలో తేడాలు కనిపిస్తే మాత్రం వైద్య సలహా తప్పనిసరి.
 
7. వ్యక్తిగత భాగంలో రక్తస్రావం
ఈ మాత్రలు తీసుకున్న కొందరిలో యోని రక్తస్రావం సాధారణం. ఇది సాధారణంగా మాత్ర తీసుకోవడం ప్రారంభించిన 3 నెలల్లో కనబడవచ్చు. పిల్ ప్రభావవంతంగా ఉంటుంది కనుక 5 లేదా అంతకంటే ఎక్కువ రోజులు రక్తస్రావం లేదా 3 లేదా అంతకంటే ఎక్కువ రోజులు అధిక రక్తస్రావం కనబడినట్లయితే సలహా కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించాలి. గర్భాశయం సన్నగా అవడం వల్ల కానీ లేదా శరీరం వివిధ స్థాయిల హార్మోన్లను కలిగి వున్నప్పుడు కూడా ఈ రక్తస్రావం జరగవచ్చు.
 
8. వికారం
కొంతమంది మొదట మాత్ర తీసుకున్నప్పుడు తేలికపాటి వికారం వస్తుంది. ఈ లక్షణాలు సాధారణంగా కొంతకాలం తర్వాత తగ్గుతాయి. మాత్రను ఆహారంతో లేదా నిద్రవేళలో తీసుకోవడం వల్ల సమస్య తీవ్రత తగ్గుతుంది. వికారం తీవ్రంగా ఉంటే లేదా 3 నెలల కన్నా ఎక్కువ కాలం కొనసాగితే వైద్యుల సలహా తప్పనిసరి.
 
9. రొమ్ము సున్నితత్వం
జనన నియంత్రణ మాత్రలు రొమ్ము విస్తరణ లేదా సున్నితత్వం పైన ప్రభావం చూపవచ్చు. ఇది సాధారణంగా మాత్రను తీసుకోవడం ప్రారంభించిన కొన్ని వారాల తర్వాత తలెత్తుతుంది. రొమ్ములో ఒక గడ్డలా వున్నా నిరంతరం నొప్పి లేదా సున్నితత్వం లేదా తీవ్రమైన రొమ్ము నొప్పి ఉన్నా వైద్య సహాయం తీసుకోవాలి. రొమ్ము సున్నితత్వం నుండి ఉపశమనం పొందాలంటే కెఫిన్ మరియు ఉప్పు తీసుకోవడం తగ్గించడం లేదంటే సహాయక బ్రా ధరించడంతో పొందవచ్చు.