1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
  4. jeera water for weight loss, fat

బానపొట్టకు జీలకర్రతో చెక్...

అనేక మంది బానపొట్ట, అధిక బరువుతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు వంటింట్లో లభించే జీలకర్రతో చెక్ పెట్టొచ్చు. గృహవైద్యంలోని కొన్ని చిట్కాలు, సూచనలు పాటించినట్టయితే బానపొట్టతో పాటు.. అధిక బరువు నుంచి కూడా వి

jeera
అనేక మంది బానపొట్ట, అధిక బరువుతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు వంటింట్లో లభించే జీలకర్రతో చెక్ పెట్టొచ్చు. గృహవైద్యంలోని కొన్ని చిట్కాలు, సూచనలు పాటించినట్టయితే బానపొట్టతో పాటు.. అధిక బరువు నుంచి కూడా విముక్తి పొందవచ్చు. అదెలాగో చూద్ధాం.
 
రెండు టేబుల్ స్పూన్ల జీల‌క‌ర్ర‌ను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నాన‌బెట్టి ఆ నీటిని ఉదయాన్నే మరగించి ప‌ర‌గ‌డుపున తాగాలి. అలాగే, రాత్రంతా నానబెట్టిన జీలకర్రను తినాలి. ఇలా నెల రోజులు చేస్తే బానపొట్ట క‌రిగిపోతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. 
 
అలాగే, ఒక గ్లాస్ నీటిని పాత్ర‌లో తీసుకుని అందులో టీస్పూన్ జీల‌క‌ర్రను వేయాలి. ఆ నీటిని బాగా మ‌రిగించి చ‌ల్లార్చాలి. అలా వ‌చ్చిన నీటిని వ‌డ‌క‌ట్టి తాగాలి. ఈ నీటిని రోజుకు 3 సార్లు తాగితే చాలు, తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అధికంగా ఉన్న కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
గ్రీన్ టీతో మేలెంత.. రాత్రి నిద్రించే ముందు తాగితే?