సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 జులై 2017 (17:52 IST)

గ్రీన్ టీతో మేలెంత.. రాత్రి నిద్రించే ముందు తాగితే?

గ్రీన్ టీ గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధులు, మానసిక ఒత్తిడి, స్థూలకాయాన్ని గ్రీన్ టీ నయం చేస్తుంది. రెగ్యులర్‌గా గ్రీన్ టీ త్రాగేవారికి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు

గ్రీన్ టీ గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. క్యాన్సర్‌, ఉదరకోశ వ్యాధులు, మానసిక ఒత్తిడి, స్థూలకాయాన్ని గ్రీన్ టీ నయం చేస్తుంది. రెగ్యులర్‌గా గ్రీన్ టీ త్రాగేవారికి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు తక్కువ. కొన్ని రకాల కేన్సర్లను రాకుండా నివారించగలిగే శక్తి గ్రీన్ టీలో ఉంది. అధిక బరువును తగ్గిస్తుంది. రోజు గ్రీన్ టీ తాగటం వల్ల అధిక కొలెస్ట్రాల్ తగ్గుతాయి. గ్రీన్ టీ చర్మ సంరక్షణకు, సౌందర్య పోషణకు కూడా ఉపయోగకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
రాత్రి పూట నిద్రించ‌డానికి గంట ముందు గ్రీన్ టీని తాగితే శ‌రీర మెటబాలిజం బాగా పెరుగుతుంది. దీంతో నిద్రపోతున్నా కూడా శ‌రీరంలో ఉన్న కొవ్వు వేగంగా క‌రిగిపోతుంది. దీనివ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. కాటెచిన్ అని పిల‌వ‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో పుష్క‌లంగా ఉంటాయి. 
 
అయితే రాత్రి పూట నిద్ర‌కు ముందు గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్లు త‌మ ప‌ని ప్రారంభిస్తాయి. దీంతో శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. అంతేకాదు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.